రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పట్టణంలో నివాసం ఉంటున్న హెడ్ మాస్టర్ బషీర్ అహమద్
రాయదుర్గం పట్టణంలో నివాసం ఉంటూ గుమ్మగట్ట మండలంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న బషీర్ అహమద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం అనంతపురం వెళ్లి తిరిగి కారులో వస్తుండగా పంపనూరు సమీపంలో కారు అదుపుతప్ ప్రమాదానికి గురైంది. బషీర్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు అంబులెన్స్ లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.