మార్కాపురం: చెన్నకేశవ స్వామి ఆలయంలో హనుమాన్ శోభాయాత్ర గోడపత్రిక ఆవిష్కరణ
మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో హనుమాన్ శోభయాత్ర కమిటీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ శోభాయాత్ర గోడపత్రిక ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... మే 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి శోభయాత్ర తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు