యర్రగొండపాలెం: దోర్నాలలో అంగన్వాడీ కార్యకర్తలకు ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపిన సిడిపిఓ విజయలక్ష్మి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల బాలికల గురుకుల పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు ఏఐ ఆధారిత శిక్షణ నిర్వహించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 0-6 సంవత్సరాల చిన్నారుల బాల్య వికాస స్క్రీనింగ్ పై శిక్షణ ఇచ్చారు. నవ చేతన యాప్ సంజీవిని ద్వారా చిన్నారుల అభివృద్ధి స్థితిని గుర్తించే విధానాలపై అవగాహన కల్పించినట్లు సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్యశ్రీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.