మార్కాపురం: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రయ్య మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలుసుకునేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సబ్ జూనియర్ మూడు నాలుగు ఐదు తరగతులు జూనియర్ ఆరు ఏడు తరగతులు సీనియర్ 8 9 తరగతులు మూడు భాగాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.