కనిగిరి: పామూరు మండలం జంగాలపల్లి గ్రామంలో వృద్ధురాలు నుంచి బంగారు గొలుసు చోరీ చేస్తున్న దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగింత
ప్రకాశం జిల్లా పామూరు మండలం జంగాలపల్లి గ్రామంలో శుక్రవారం వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేస్తున్న యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ మెడలో నుంచి యువకుడు బంగారు గొలుసును బలంగా లాగాడు. వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు వచ్చి యువకుడిని పట్టుకొని చితకబాధడంతో పాటు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.