గిద్దలూరు: ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు హెవీ వాహనా డ్రైవర్ల ఫేస్ వాష్ కార్యక్రమానికి చేపట్టిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జాతీయ రాష్ట్రీయ రహదారులపై హెవీ వెహికల్స్ డ్రైవర్లకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టారు. నిద్ర వస్తే కొద్దిగా సేపు రోడ్డు పక్కన సురక్షితమైన ప్రాంతాలలో పార్కింగ్కు ఇచ్చిన స్థలాలలో జాగ్రత్తగా నిద్రించి తర్వాత గమ్యస్థానాలకు చేరాలని డ్రైవర్లకు సూచిస్తున్నట్లు పోలీసులు అన్నారు. ఎదుటివారి ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలని పోలీసులు తెలిపారు.