దర్శి: దర్శి పట్టణంలో మందుల షాపులు మూతపడడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు
Darsi, Prakasam | May 20, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో దేశవ్యాప్త మెడికల్ షాపులు బంద్ కారణంగా అన్ని మెడికల్ షాపులు మూతపడ్డాయి. దీనితో ప్రతినిత్యం మందులు వాడుకునే వారికి ఇబ్బందికరంగా మారింది. గ్రామ ప్రాంతాల నుంచి కూడా మందుల కోసం వచ్చిన వారు చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్తున్నారు. మందుల షాపులో నేడు లేవని తెలియక వచ్చినట్లు మందులు కొనుగోలుదారులలో ఒకరు తెలియజేశారు.