మార్కాపురం: కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
కొనకనమిట్ల మండలం వెలిగండ్ల, మునగపాడు, బసవపురం, వద్దిమడుగు, ఇరుసలగూడెం, పెద్దరికట్ల గ్రామాలలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పర్యటించారు. అనంతరం ఆయా గ్రామాల బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. కార్యకర్తలు ప్రజలకు అభివృద్ధిని వివరించాలన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయకుండా అరాచకం చేశారని విమర్శించారు. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.