రాయదుర్గం: మంచినీరు దొరకడం లేదు గాని బీరు బ్రాందీ ఏరులై పారుతోంది : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి
రాయదుర్గంలో మంచినీరు దొరకడం లేదుగానీ బీరు బ్రాందీ ఏరులై పారుతోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి మండిపడ్డారు. ఆదివారం రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసి ఎంఆర్పి కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊరువాకాలి అనిల్, తదితరులు పాల్గొన్నారు.