మార్కాపురం: మే 12వ తేదీ హనుమాన్ శోభాయాత్ర జయప్రదం చేయాలని విశ్వహిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక సమావేశం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సంఘాలు దేవాలయ కమిటీలు హనుమాన్ శోభాయాత్ర పై సమావేశం నిర్వహించారు. మే 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విశ్వహిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. కనివిని ఎరగని రీతిలో జిల్లా కేంద్రంలో 5000 మందితో భారీ శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మొట్టమొదటిసారి ప్రముఖ భజన బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.