యర్రగొండపాలెం: పోతంపల్లి గ్రామానికి వెళ్లాలంటే రహదారి అద్వాన పరిస్థితుల్లో ఉంది. సంబంధిత అధికారులు స్పందించాలని కోరిన గ్రామస్తులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పోతంపల్లికి వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారి అద్వాన పరిస్థితుల్లో ఉంది. వర్షం పడిందంటే గుంతలు నుండి ప్రమాదకరంగా మారుతుంది. పోతంపల్లి నుంచి గుంటూరు కర్నూలు జాతీయ రహదారి వరకు ఇదే పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.