యర్రగొండపాలెం: దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు ఆటోలో నుండి కింద పడిన బయన్నకు తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డు లోని గణపతి అటవీ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మర్రిపాలెం గిరిజన గూడెంకు చెందిన కుడుముల బయన్న కుటుంబ సభ్యులతో కలిసి దోర్నాలకు వస్తుండగా ఆటో ముందు చుక్కల దుప్పి అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయగా ముందు కూర్చున్న బయన్న కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని దోర్నాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా వైద్యులు చికిత్స అందించారు.