మార్కాపురం: స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జెసి శ్రీనివాసులు పాల్గొన్నారు. చెరువు అలుగులో ఉన్న తామరాకు తొలగింపు చర్యను చేపట్టారు. అలుగు, చెరువు సప్లై ఛానల్ పరిసర ప్రాంతాలను ముఖ్య అతిథులు పరిశీలించారు. తామరాకు తొలగించి నీటిని నిలువ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.