మార్కాపురం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ లోని క్యాంటీన్లో అధిక రేట్లు తగ్గించాలని క్రిమినల్ అడ్వకేట్ అజిత్ కుమార్ అధికారులకు ఫిర్యాదు
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ లోని క్యాంటీన్లో అధిక రేట్లకు కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నారని క్రిమినల్ అడ్వకేట్ అజిత్ కుమార్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీ ధరల కన్నా అరికధరలకు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ స్నాక్స్ విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ కేసులు నమోదైన క్యాంటీన్ యాజమాన్యం తీరు మారలేదని వినియోగదారులను దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.