మార్కాపురం: మార్కాపురం మండలంలో జనగణన పై అవగాహన కల్పించిన ఎమ్మార్వో చిరంజీవి
మార్కాపురం మండలం దరిమడుగు ఇడుపూరు గ్రామాలలో ఎమ్మార్వో చిరంజీవి జనగణన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట విడతగా మే ఒకటో తేదీ నుండి 30వ తేదీ వరకు ఇండ్ల గణన చేస్తారన్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వయంగా ఇంటి వద్ద నుండే స్వీయ గణన చేసుకోవచ్చన్నారు. నమోదు ప్రక్రియను పలు ఇండ్ల వద్ద మొబైల్ లో చూయించి అవగాహన కల్పించారు