దర్శి: దొనకొండలో 170 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత
Darsi, Prakasam | Apr 24, 2025 దర్శి నియోజకవర్గం దొనకొండ లో 170 రేషన్ బియ్యం బస్తాలను బుధవారం సంబంధిత శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక బాధాపురం రోడ్డులో మాదాల రాముకు చెందిన ఇంటి యందు 170 బస్తాల రేషన్ బియ్యం గుర్తించి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రవిబాబు ఆధ్వర్యంలో స్వాధీనపరచుకొని గోడౌన్ కు తరలించారు. స్థానిక రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు