దర్శి: ముండ్లమూరు మండలం ఉల్లగల్లు వద్ద ఆటో బోల్తా మహిళ మృతి
Darsi, Prakasam | Apr 23, 2025 ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి మహిళ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. దర్శి మండలం తాను చింతల గ్రామంకు చెందిన ఆటో దర్శి మండలం లంకోజన పల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 11 మంది మహిళ కూలీలను ఆటోలో ఎక్కించుకొని ముండ్లమూరు మండలం ఉమా మహేశ్వరపురం గ్రామ పొలాల్లోని మిరప కోత పనికి వెళ్తుండగా పెద్ద ఉల్లగల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది.అందులో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలకు గాయాలు కాగా అందులో ప్రయాణిస్తున్న లంకోజన పల్లికి చెందిన బండి చారమ్మ అనే మహిళ మృతి చెందింది.