దర్శి: దర్శి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన తహసిల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్
Darsi, Prakasam | Apr 22, 2025 దర్శి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం రెవిన్యూ శాఖ మరియు మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రోడ్డుపై ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తహసిల్దార్ మరియు మున్సిపల్ అధికారులు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు త్వరలోనే తొలగిపోనున్నట్లు అధికారులు తెలిపారు.