దర్శి: మారెళ్ళ గ్రామంలో దైవ చెట్టుగా చెప్పుకునే రావి చెట్టుకు పచ్చని ఆకులతో ప్రత్యేక ఆకర్షణ
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో తొలగించిన రావి చెట్టు నిటారుగా నిలబడిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసినదే. దైవ వృక్షంగా భావిస్తున్న చెట్టు ప్రస్తుతం పచ్చని ఆకులతో అందంగా కనిపిస్తూ స్థానికులు దృష్టిని ఆకర్షించింది. ఈ చెట్టు దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలు వస్తున్నారు. చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.