యర్రగొండపాలెం: పుల్లలచెరువులో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు చిన్నపిల్లలు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు లో కోతుల బెడతా ఎక్కువగా ఉందని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇండ్ల నుంచి అవసరానికి దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలని ఇండ్ల ముందు పనులు చేసుకోవాలన్న ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు బడులకు వెళ్లాలన్నా కోతుల భయంతో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చాలా రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వాటిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.