యర్రగొండపాలెం: దోర్నాల బిజెపి అధ్యక్ష పదవిపై వివాదం, మీడియా ముందుకు వచ్చి అధ్యక్ష పదవిపై అసంతృప్తి వ్యక్తం చేసిన బిజెపి నాయకులు
మార్కాపురం జిల్లా దోర్నాల మండల బీజేపీలో అధ్యక్ష నియామకం వివాదాస్పదమైంది. ఈ అంశంపై దోర్నాల, పెద్దారవీడు బీజేపీ నాయకులు వీరారెడ్డి, కోటిరెడ్డి, అల్లూరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అధ్యక్షురాలు సురవరం మల్లీశ్వరిని సంప్రదించకుండా కొత్త వ్యక్తిని నియమించడం సరైందికాదన్నారు. జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోత్రెడ్డి తీసుకున్న నిర్ణయం పార్టీ విధానాలకు విరుద్ధమని విమర్శించారు.