కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం: దసరా పండుగ రోజు విద్యుత్ షాక్తో యువకుడు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రాయన్నపేటలో దసరా పండుగ రోజున విషాదం నెలకొంది. పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి విద్యుత్ తీగలు కలుపుతుండగా ప్రమాదవశాత్తు సర్ప నితిన్ (20) అనే యువకుడు మృతి చెందాడు. వైరు తెగిపడటంతో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.