మార్కాపురం: జిల్లా కేంద్రంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రాంబాబు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు నియోజకవర్గ వైసిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని స్థానాలలో వైఎస్ఆర్సిపి పోటీ చేస్తున్న అన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొందాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏ కార్యకర్త భయపడాల్సిన పని లేదన్నారు. రోజులో ఒకేలా ఉండవు త్వరలో మనకు మంచి రోజులు వస్తాయన్నారు.