మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూన్ ఒకటో తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూన్ ఒకటో తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలన్నారు. అదేవిధంగా 1100 నెంబర్ కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.