యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం కొండారెడ్డి కాలనీలో ఓ ఇంట్లో పాము కలకలం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని కొండారెడ్డి కాలనీలో రమణమూర్తి ఇంట్లో పాము కలకలం రేపింది. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. గతంలో ఉన్న స్నేక్ క్యాచర్ నిధుల కొరత వలన తొలగించడంతో ఎర్రగొండపాలెం తో పాటు మూడు మండలాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాములు పట్టుకోవడానికి ఎవరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు తెలిపారు.