మార్కాపురం: సీతా నాగులవరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ పై పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా టిడిపి వైసిపి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టిడిపి విద్యుత్ ప్రభ పై ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశామని మరెన్నో కార్యాలయాలు ఏర్పాటు కాబోతున్నాయి అన్నారు. పెరిగిన భూములతో రైతులకు మేలు జరుగుతుందన్నారు