రాయదుర్గం: నారా లోకేష్ కు వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేకే వైసిపి దుష్ప్రచారం : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
దేశ వ్యాప్తంగా నారా లోకేష్ కు వస్తున్న పేరు, ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయ కక్షతో మెగా DSC పై YCP దుష్ప్రచారం చేస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ద్వజమెత్తారు. రాయదుర్గంలో సోమవారం మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు 16 వేల ఉపాద్యాయ పోస్టులు భర్తీ చేసిన విషయం గుర్తు చేశారు. అడుగడుగునా అడ్డుపడుతున్న విష వృక్షం లాంటి వైసిపి రాష్ట్రానికి అవసరమా అని ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.