రాయదుర్గం: ఉంతకల్లు లోని ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ
బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మద్యాహ్న భోజనాన్ని ఎంఈఓ మల్లికార్జున సోమవారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో కలసి నూత అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. అలాగే స్థానిక రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం ట్రస్టు వారు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ రిపేరికి రూ. 30 వేల నిధులు కేటాయించి ఉపయోగంలోకి తీసుకురావడంతో వారిని అభినందించారు. విద్యాభివృద్ధికి సహకరించడంపై కృతజ్ఞతలు తెలిపారు.