గిద్దలూరు: కంభంలోని కందులాపురం సెంటర్లో దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రజలకు మైక్ సెట్ ద్వారా అవగాహన కల్పించిన ఎస్సై శివకృష్ణారెడ్డి
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో దొంగతనాలు అరికట్ట అంశంపై ప్రజలకు శివకృష్ణారెడ్డి అవగాహన కల్పించారు. మైక్ సెట్ ద్వారా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. వేసవి సెలవులు కావడంతో ప్రజలు ఎవరు ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో తమ ఇంటిలో విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు నగదు ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలి అన్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం వచ్చినట్లయితే ఆ ఇంటి పై నిఘా ఉంచి చోరీలు జరగకుండా చూస్తామన్నారు.