కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో అధిక తిరస్కరణల వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పొగాకు రైతు గోపి
ప్రకాశం జిల్లా కొండపిలో పొగాకు వేలం కేంద్రం ప్రారంభించి రెండు నెలలు దాటినా పొగాకు బేళ్లు అమ్మకాలు జరగలేదని గోపి అనే రైతు వాపోయాడు. ఐదు బార్నెలకు పొగాకు పండించి 35 క్వింటాళ్లకు పైగా అమ్మాల్సి ఉంటే కేవలం ఐదు క్వింటాలు మాత్రమే అమ్మానని చెప్పాడు. నాణ్యమైన పొగాకు తీసుకువెళ్లినా కొనుగోలుచేయకుండా తిరస్కరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.