గిద్దలూరు: బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలో గొర్రెల గుంపు ని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, 35 గొర్రెలు మృతి
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గొర్రెల గుంపును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనలో 35 గొర్రెలు మృతి చెందగా మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కొమరోలు మండలం కత్తులవానిపల్లి గ్రామానికి చెందిన రైతులు పెద్ద పెద్దిరాజు, కృష్ణంరాజు, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు మేత కోసం మోక్షగుండం ప్రాంతంలోకి తీసుకువచ్చి గొర్రెలను పెంచుతున్నారు. అర్ధరాత్రి సమయం లో గొర్రెలు రోడ్డు దాటుతుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపు పై దూసుకు వెళ్ళింది. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.