స్వదేశీ వస్తువులనే వాడాలని బిజెపి మాజీ అసెంబ్లీ కన్వీనర్ చిన్నయ్య అవగాహన కల్పించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలలో ప్రధానమంత్రి మోడీ పిలుపుమేరకు స్వదేశీ వస్తువులను తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ప్రతి ఒక్కరూ విదేశీ వస్తువులను విడనాడాలని స్వదేశీ వస్తువులే ముద్దు అని పేర్కొన్నారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.