కొండపి: జరుగుమల్లి మండలం అంబేద్కర్ నగర్లోని పోలేరమ్మ ఆలయంలో భారీ చోరీ, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని అంబేద్కర్ నగర్లో పోలేరమ్మ ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు ఆలయంలోని హుండీని పగలగొట్టి నగదు దోచుకు వెళ్లారు. ఉదయాన్నే ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన అర్చకులు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీం ని రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మొత్తంలో నగదు పోయిందో తెలియవలసి ఉందని సంవత్సరం నుంచి హుండీలో నగదు తీయలేదని కమిటీ సభ్యులు తెలిపారు.