రాయదుర్గం: కుటుంబ కలహాల నేపథ్యంలో జుంజురాంపల్లిలో వివాహిత ఆత్మహత్య
*కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య* కుటుంబ కలహాల నేపథ్యంలో రాయదుర్గం మండలం జుంజురాంపల్లి గ్రామంలో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చిక్కోభనహళ్లికి చెందిన ఆశాను 6 ఏళ్ల క్రితం జుంజురాంపల్లికి చెందిన కృష్ణ అలియాస్ వన్నూరుస్వామికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. మంగళవారం రాత్రి భర్త మద్యం మత్తులో ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటి తలుపులు వేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న భార్య ఆశా, క్షణికావేశంలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మద్యం మత్తులో ఇంటి బయటే పడుకున్న భర్త బుధవారం ఉద