మార్కాపురం: బొడిచర్ల వద్ద గాయపడిన మహబూబ్ బాషా కుటుంబ సభ్యులకు 70 వేల నగదు మొబైల్ ఫోన్ అందజేసిన 108 సిబ్బంది
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం బొడిచర్ల సమీపంలో మంగళవారం రాత్రి అడవి పంది ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న మహబూబ్ బాషా కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని వద్ద సుమారు 70 వేల రూపాయలు నగదు మొబైల్ ఫోను 108 సిబ్బంది వారి బంధువైన ముర్తుజావలికి అప్పగించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.