యర్రగొండపాలెం: పెద్ద దోర్నాల మండలంలో శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆక్రమణలు, రోడ్డుకు అడ్డంగా వేలాడుతున్న విద్యుత్ తీగలపై అగ్రహం
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆక్రమణలు, రోడ్డుకు అడ్డంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరువైపులా మెట్లు నిర్మించడంతో రహదారి ఇరుకైంది. మధ్యలో వాహనాల పార్కింగ్తో రాకపోకలు కష్టమయ్యాయి. డ్రైనేజీ సమస్యతో వర్షాకాలంలో మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.