గిద్దలూరు: కంభంలో పెళ్లి బృందాన్ని ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మార్పీఎస్ షాలెం రాజు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా అందులో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మాట్లాడిన ఎమ్మార్పీఎస్ నాయకులు షాలెం రాజ్.. జరిగిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని బాధ్యత కుటుంబాలకు ఆదుకొని ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు.