దర్శి: ఎండ తీవ్రతతో ప్రధాన వీధులు వ్యాపార సముదాయాలు జనసంచారం లేక బోసిపోయిన దర్శి పట్టణం
Darsi, Prakasam | Apr 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఆదివారం ఉదయం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని పట్టణ ప్రజలు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఎండ ఎక్కువగా ఉండటంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పట్టణంలోని ప్రధాన వీధులు వ్యాపార సముదాయాలు జనసంచారం లేక బోసిపోయి కనిపించాయి. గత వారం నుంచి ఎండలు బాగా పెరిగాయని వారన్నారు.