కొండపి: సింగరాయకొండలో నూతన అన్న క్యాంటీన్ ని ప్రారంభించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని బాలయోగి నగర్ సమీపంలో నూతన అన్న క్యాంటీన్ ని బుధవారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి అన్నారు. పేదలకు ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అందించడం జరుగుతుందని గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ తీసివేసి పేదల కడుపు కొట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. తర్వాత అందరూ అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు.