రఘునాథపల్లె: బాంజీపేటలో మద్యపాన నిషేధం కోసం ర్యాలీ: అక్టోబర్ నుంచి దుకాణాలు బంద్!
జనగామ జిల్లా బాంజీపేటను మద్యం రహిత గ్రామంగా మార్చేందుకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. అక్టోబర్ నుంచి గ్రామంలో మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మద్యం విక్రయాలు జరగకుండా అందరూ సహకరించాలని కోరారు.