దర్శి: పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి
Darsi, Prakasam | Jun 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక విచిత్రమైన ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి నష్టం కలిగే పని నేను చెయ్యను, చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.