రాయదుర్గం: పట్టణంలో ప్రారంభమైన జనగణన 2027 ఇండ్ల గణన ప్రక్రియ
జనగణన 2027లో బాగంగా మొదటి విడత కింద చేపడుతున్న ఇండ్ల గణన ప్రక్రియ ప్రారంభమైంది. రాయదుర్గంలో ఆర్డీఓ వసంతబాబు, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహసీల్దార్ హరికుమార్ ల సమక్షంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు గురువారం స్వయంగా ఆన్ లైన్ లో తన కుటుంబ వివరాలు నమోదు చేసి స్వీయ గణన చేసుకుని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వీయ గణన చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.