కళ్యాణదుర్గం: ఉమ్మడి అనంత జిల్లా ప్రజల ప్రాణదాత ఫాదర్ ఇన్స్టెంట్ ఫెర్రర్: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నో ఆసుపత్రులు నిర్మించి అనేకమంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాత ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని ఆసుపత్రి ఆవరణలో ఉన్న విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం, ప్రజా వేదికలో విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఫెర్రర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఫెర్రర్ గొప్పతనం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఫెర్రర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.