తాడిపత్రి: సీఎం పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: యాడికి లో జిల్లా కలెక్టర్ ఆనంద్
ఈనెల 6న యాడికి లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్న విషయం తెలిసిందే. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్, సీఎం పర్యటన కోఆర్డినేటర్ వెంకటేష్, జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సీఎం పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటు పాటు ఉండకూడదన్నారు. అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు.