Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కంభం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. సూరేపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ చేసిన దొంగలు

Giddalur, Prakasam | Apr 26, 2026
మార్కాపురం జిల్లా కంభం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. సూరేపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోకి శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రవేశించిన దొంగలు హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకు వెళ్లారు. రూ.10వేలు నగదు వరకు దొంగలు దోచుకు వెళ్లారని ఆలయ నిర్వహకులు తెలిపారు. ఉదయం ఆలయాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన గ్రామస్తులు దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీం ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం దొంగల వేలిముద్రలు సేకరించారు. సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

MORE NEWS

గిద్దలూరు: కంభం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. సూరేపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ చేసిన దొంగలు - Giddalur News