రాయదుర్గం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో బాలుడితో సహా ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
రాయదుర్గం మండలం రాతిబావివంక వద్ద ఆదివారం రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలుడితో సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, మెలకల్మూరుకు చెందిన మహేష్ బాలుడితో కలిసి బైక్‌పై వస్తుండగా, టి.వీరాపురానికి చెందిన మరో వ్యక్తి నడుపుతున్న బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. రాయదుర్గం పోలీసులు ప్రమాద ఘటనదర్యాప్తు చేస్తున్నారు.