గిద్దలూరు: కొమరోలు మండలంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రమాదల నివారణకు మిర్రర్లు ఏర్పాటు
మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం స్థానిక ఎస్ఐ నాగరాజు మిర్రర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మూలమలుపుల వద్ద మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. మలుపులు తిరిగే సమయంలో వాహనదారులు ఈ మిర్రర్లు ఉపయోగించుకొని ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని ఎస్సై నాగరాజు వాహనదారులకు సూచించారు.