రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో చెరువుదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి దుర్మరణం
గుమ్మగట్ట మండలంలోని గొల్లపల్లి సమీపంలో ఆదివారం మద్యాహ్నం జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో చెరుదొడ్డి గ్రామానికి చెందిన ప్రహల్లాద దుర్మరణం పాలయ్యాడు. ప్రహల్లాద మరొకరితో కలసి బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రహల్లాద మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.