మార్కాపురం: రామతీర్థం జలాలతో పొదిలి ప్రజలకు తీరనున్న కష్టాలు త్వరలో పనులు ప్రారంభం
మార్కాపురం జిల్లా పొదిలికి త్వరలో నీటి కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం దర్శి నుంచి వారానికి మూడు రోజులు మాత్రమే నీరు వస్తుంది. దీంతో సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన విషయం తెలిసినదే. రామతీర్థం నుంచి పొదిలికి 23 కిలోమీటర్ల మేరా ప్రత్యేకంగా పైపులైన్లు వేసి పొదిలికి జలాలను తీసుకురానున్నారు. 119 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయని ఏఈ శంకర్ నాయక్ తెలిపారు