యర్రగొండపాలెం: నాయుడు పల్లి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరీషన్ బాబు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో లబ్ధిదారులకు నేరుగా పింఛన్ అందజేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.